'సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి'కి, 'తెలంగాణ రాష్ట్రాని'కి' మధ్య తమ అభిప్రా యాన్ని ఎంచుకునే పరిస్థితిని ప్రజలు ఎదుర్కొన్నారు. ప్రజా బాహుళ్యతీర్పు 'వేరు తెలంగాణ'కే నన్నది స్పష్టమైంది కూడా. ప్రజా తీర్పును కొన్ని రాజకీయ పార్టీలు కేవలం 'తెలంగాణ సెంటిమెంటు'కే ముడి పెడుతున్నాయి. ఇది ప్రాంతీయ భావనకు బలమైన నిదర్శనంగా, హేతుబద్ధమ యినదనికూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజల దృష్టిలో సమైక్య రాష్ట్రం లో అభివృద్ధి 'మిధ్య' మాత్రమేననేది అర్థమయింది. సాగునీటి వనరుల్లో, ఉద్యోగ నియామకాల్లో, వ్యాపారావకాశాల్లో, రాజకీయ నిర్ణయాత్మకతలో దేనిలోకూడా తమవాటా తమకుదక్కేఅవకాశం సమైక్యరాష్ట్రంలో సాధ్యం కాదనికూడా అర్థం చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమం వ్యాప్తి 1969 నాటి కన్న ఈ రోజు విశాల పరిధి కలిగివున్నది. రైతులు, యువజనులు, మహిళలు అందరు ఇవాళ ఇందు లో భాగస్వాములుగా వున్నారు. 1969 ఉద్యమం అందరు అనుకున్నట్లు ఆనాటి నాయకుల అవకాశవాద రాజకీయాలవల్లనో లేక రాజ్య నిర్బంధ చర్యలవల్లనో నీరుగారలేదు. అందుకు 1970ల్లో జరిగిన కొన్ని పరిణామా లు కారణంగా చెప్పుకోవచ్చు. 1970 దశకం ప్రారంభంలో ఇందిరాగాంధీ 'గరీబీహఠావో' నినాదంతో పేదప్రజానీకాన్ని ఆకట్టుకొన్నారు. ఆమె స మ్మోహనశక్తి ఎంత బలంగా ఉందంటే ఆ దశకం చివరలో జరిగిన ఎన్ని కల్లో, ఇందిరాగాంధీ కేంద్రంలో అధికారం కోల్పోయినప్పటికీ, రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేయగలిగింది. ఆ తర్వాత 1980లో ఎన్.టి. రామారావుకూడా పేదలు, మహిళల సమస్యలను ఎజెండామీదకు తీసుకురాగలిగారు. పేదరికం నిర్మూలనకై ఈ ఇద్దరు నేత లు చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలవలన సామాన్య ప్రజలు వీరిపై చాలా ఎక్కువగానే ఆశలు పెట్టుకొన్నారు. ఈ నేతల నమ్మదగిన చర్యలు వల్లనే తెలంగాణప్రాంతంలో కూడా తాత్కాలికంగా వేర్పాటు ఉద్యమం వెనుకకు పోయింది. ఈ నేతల మరణాంతరం వీరి వారసులు వీరు చేప ట్టిన పథకాలను ముందుకు తీసుకుపోక పోవడంవల్ల పేద ప్రజలకను కూల విధానాలు మనలేకపోయాయి. అంతేకాక సామాజిక ఆర్థిక విధానా లు పూర్తిగా రూపాంతరం చెందాయి. తర్వాత వచ్చిన సరళీకరణ దశలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక రంగాలు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభ పరిస్థితి ఏర్పడిం ది. ప్రాంతీయ అసమానతలు ఇంకా బలంగా ముందుకొచ్చాయి.
ఏభై ఏళ్లనాడు మొదటి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సంఘం (ఎస్సార్సీ) తెలంగాణ ప్రాంతంలోని అసంతృప్తి జ్వాలల దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటును సిఫారసు చేసింది. అసంతృప్తి ఇంకా తీవ్రంగా ఉన్న ఇవ్వాళ్టి పరిస్థితుల్లో రెండో ఎస్సార్సీకూడా మొదటి ఎస్సార్సీ చేసిన సిఫారసునే బలపరిచే అవ కాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెనువెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమంచేస్తే వచ్చే ఆంధ్రప్రాంత ప్రజల వ్యతిరేకతను ప్రస్తుతా నికి నివారించి అనివార్యంగా తెలంగాణ రాష్ట్రావతరణ తప్పనిసరి అనే అంగీకారానికి తీరాంధ్రులను తీసుకురావడానికి రెండవఎస్సార్సీ వ్యూహా న్ని ఉపయోగిస్తున్నట్లయితే అది ఎంతో వ్యయంతో కూడుకున్నదే అవు తుంది. ఎందుకంటే దేశంలో ఇంకా అనేక చిన్నరాష్ట్రాల డిమాండ్లను (కొ న్ని న్యాయసమ్మతమైనవి, కొన్నికానివి) ఈ కమిషన్ ఎదుర్కోవలసి ఉం టుంది. ఇవన్నీ కాదనుకున్నా మొదటిఎస్సార్సీ సిఫారసులు అమలు బుట్ట దాఖలయిన నేపథ్యం, ప్రస్తుత ఉద్యమ నేపథ్యం దృష్ట్యా రెండవ ఎస్సార్సీ నియామకం తెలంగాణప్రజలను ఏవిధంగాకూడా తృప్తిపరచలేదు. ప్రత్యే క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒప్పుకోని వర్గాలకు కొన్ని సంస్కరణలు చేపట్టడం సూత్రబద్ధమయిన, నిజాయితీతో కూడిన ప్రతిస్పందనగా వుం డవచ్చునేమో. ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రజల బాగోగుల కోసం మళ్లా ఒకసారి భూసంస్కరణలు, ఇంకా వెనుకబాటును తగ్గించే పథకాలను చిత్తశుద్ధితో తీసుకు రావలసి ఉంటుంది. ప్రాంతీయ అవసరాల కనుగుణంగా నిపుణులతో ప్రజా ప్రతినిధులతో కూడిన ' ప్రాం తీయ ప్రణాళికా -అభివృద్ధి బోర్డుల'ను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. వనరుల పంపిణీని పారదర్శకంగా ఉంచవలసి ఉంటుంది. ప్రజాప్రతిని ధులకు జవాబుదారీగా వీటిని ఉంచవలసి ఉంటుంది. ఇదేకాక తెలంగాణ అభివృద్ధికోసం ఇస్తామంటున్న 10,000 కోట్లరూపాయల ప్యాకేజిని ఇఫ్పు డున్న వనరుల్లో తెలంగాణవాటాకు అదనంగాఉండాలి. ప్రాంతీయ ప్రణా ళికా ప్రక్రియలో ఈ ప్యాకేజీ అంతర్భాగంగా ఉండాలి. అయితే ఇవన్నీ కూడాగతంలో ప్రభుత్వాలు చేపట్టి త్వరలోనే విరమించడం వలన వ్యర్థ ప్రయోగాలుగానే మిగిలిపోయాయి. మళ్లీ ఇదే బాటలో ఎంతో ఆలస్యం గా పై విధమైన చర్యలుచేపడితే ప్రజలనుంచి అనుకూల స్పందన ఉండక పోవచ్చు.
మనరాష్ట్రంలో ప్రాంతీయప్రణాళిక కొత్త అంశమేమీకాదు. అయితే రాజ కీయంగా దీనిని ఎప్పుడూ చిత్తశుద్ధితో పట్టించుకోలేదు. కీలక సమాచారం ప్రజాప్రతినిధులకు అందుబాటులోఉంటుందని, అది ప్రాంతీయ తత్వాని కి దారితీస్తుందనే తప్పుడు ఆలోచనా సరళి మొత్తం ప్రాంతీయ ప్రణాళిక ప్రక్రియకే గొడ్డలిపెట్టుఅయ్యింది. ప్రజాప్రతినిధులతో ఏర్పాటయిన ప్రాం తీయ ప్రణాళికా సంస్థలను నిర్వీర్యం చేయడం వలన సమాచారాన్ని తొక్కి పెట్టడం వలన తెలంగాణ ప్రజల మనోభావాలు బాగా దెబ్బ తిన్నాయి. ఇది చరిత్ర నేర్పినపాఠం. మొదటి ఎస్సార్సీకి తెలంగాణ ప్రాంత భయా లు, ఆ ప్రజలు ఎదుర్కోబోయే పరిణామాల పట్ల స్పష్టమైన అవగాహన ఆనాడే ఉండినది. సమస్యస్వరూపాన్ని, తీవ్రతనూ అర్థం చేసుకొన్నందు వల్లనే ఈ కమిషన్ ఐదు సంవత్సరాల కాలంలో ప్రధానంగా సాధించా ల్సిన విషయాలు రెండు అని నొక్కిచెప్పింది. అవి: (అ) ఇతర ప్రాంతా లతో సమానంగా ఇక్కడ అవస్థాపన సౌకర్యాలను మెరుగుపరచగలగాలి; (ఆ)ఎలాంటి బలవంతంలేని ఒప్పందంద్వారా ఆంధ్రతో సమైక్యత సాధిం చేందుకు తెలంగాణ ప్రాంతప్రజలను తయారుచేయడం. అంతేకాక తెలం గాణకు చెందిన మూడింట రెండు వంతుల ప్రజా ప్రతినిధులు విలీనానికి అంగీకరిస్తేనే సమైక్య రాష్ట్రం ఏర్పడాలని స్పష్టంగా ఈ కమిషన్ చెప్పింది. అయితే పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సులకు భిన్నంగా ఆచరణ కొన సాగింది. తెలంగాణవాసుల అభిప్రాయాలను పక్కనబెట్టి ఇతర ప్రాంతాల ప్రయోజనాలను మాత్రమే పరిగణించడం ఆచరణగా మారింది. ఇది శోచ నీయం. 1956లో పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతీ య కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో ప్రజాప్రతినిధులు సభ్యులు గా ఉండేవారు. తెలంగాణప్రాంతంలో అభివృద్ధి సాధించేందుకు వనరు లను గుర్తించడం, వీటిని వివిధ అవసరాలకు కేటాయించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. అయితే కొద్ది కాలానికి దీనిని రద్దు చేసినారు. 1973లో ఆరు సూత్రాల పథకం కారణంగా తెలంగాణ ప్రాంతీయ కమిటీకి స్వస్తి చెప్పారు. దాని స్థానంలో ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంతీయ కమిటీకి జవాబుదారీతనం ఉండెను. కాని ప్రాంతీ య అభివృద్ధి మండలి ఎవరికి జవాబుదారి కాదు. అయితే ఈ మండలిని కూడ రద్దు చేశారు. ప్రస్తుతం ప్రాంతీయ ప్రణాళిక ప్రక్రియకు ఎలాంటి సాధనాలు, వ్యవస్థలు లేవు.
ఫైనాన్స్ కమిషన్‌ద్వారా జరిగే కేంద్ర-రాష్ట్ర విత్త బదిలీలలో 25 శాతం జనాభా ఆధారంగాకాగా, 75శాతం తలసరి ఆదాయం, ఇంకా ఇతర వెనుకబాటు సూచికల ఆధారంగా జరగుతుంది. ఈ విధంగా తెలంగాణ లోని అత్యల్ప తలసరి ఆదాయంవల్లనే రాష్ట్రానికి విత్త బదిలీలు అధికం గా వచ్చాయి. ఈదృష్ట్యా తెలంగాణకై ఏర్పాటుచేసిన ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికకుగాని, లేక తెలంగాణ రాష్ట్రానికిగానీ ఏ విధమైన విత్తపరమైన అవరోధాలు ఉండే ఆస్కారంలేదు. ఇంత పెద్దది, వైవిధ్యం కలిగిన రాష్ట్రం లో అసలు ప్రాంతీయ ప్రణాళిక, అభివృద్ధి కమిటీలు ఇంకా భాగస్వా మ్యసంస్థల ద్వారా అభివృద్ధి జరగడానికి ఎంతమాత్రం అవకాశం ఉంది? రాష్ట్ర స్థాయిలో ఉండే ప్రణాళికా రాజకీయాలు మనకు ఈ రకమైన సాధ నాలు, సంస్థల ఏ ప్రయోజనం చేకూర్చవనే అనుభవాన్ని మిగిల్చింది. ఏక రూపత కలిగిన చిన్న రాష్ట్రాలలోనే ఆర్థికవృద్ధి, సమత్వంసమస్యలపై రాజ కీయ నిబద్ధత కనబడుతుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈ విషయంలో మంచి ఉదాహరణ. ఉత్తరాఖండ్ అవతరించిన ఆరు సంవత్సరాల తర్వాత అక్క డ సాలీన స్థూలరాష్ట్ర ఉత్పత్తివృద్ధిరేటు ఎంతగానో పెరిగి రెండంకెల స్థాయిని కూడా దాటింది. తెలంగాణ రాష్ట్ర హోదాకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రాబల్య రాజకీయ నాయకత్వంనుంచి ఎక్కువగా ఆశించడం సరైందికాదమో. నిజానికి ఈ విషయంలో కేంద్ర నాయకత్వాన్ని అందునా పండిట్ నెహ్రూ వంటి నాయకులనుకూడా వీరు ప్రభావితం చేయగలి గారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎస్సార్సీ ముందు చూపు, నెహ్రూ దార్శనికత ఇవాళ మనకు సవాలును విసురుతున్నాయి. జాతీయ నాయకత్వం ఈ విషయంలో వివేచనతో స్పందించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటారని ప్రజలుఆశిస్తున్నారు. ఇవాళున్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజనకు ఆంధ్ర ప్రాంతంనుంచి కూడా పెద్ద గా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ప్రస్తుత అనిశ్చితపరిస్థితికన్నా రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడం మంచిదనే అభిప్రాయం కలుగవచ్చు. అట్లాగే తెలంగాణ రాష్ట్రావతరణ ఇక్కడి ప్రజల సృజనాత్మకశక్తికి జీవం పోస్తుంది; ఈ ప్రాంతపు సామాజిక పరివర్తనను సుగమం చేస్తుంది. బడుగు, బల హీన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయాన్ని చేకూరుస్తుంది. వారి ఆశలు, ఆశయాల కనుగుణంగా నాయకత్వంలోకి రాగలిగే అవకాశాన్ని కలిగిస్తుం ది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి క్రియాశీలక భాగస్వామ్యంతో చిన్న రాష్ట్రాలు సుపరిపాలనకు మెరుగైన అవకాశాలు ఇవ్వగలుగుతాయి.
(వ్యాసకర్త 'సెస్' ఛైర్మన్, ప్రణాళికా సంఘం పూర్వ సభ్యులు)
Friday, September 19, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment