కృష్ణా బేసిన్‌లో ఉన్న జంటనగరాలకు గోదావరి జలాలను సరఫరా చేయడం సబబేనా? తెలం గాణ ప్రాంతానికి సాగునీటి సదుపాయం కల్పిం చేందుకు ఉద్దేశించిన ఒకటి రెండు ప్రాజెక్టులు ఇప్పటికే జంటనగరాలకు తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్ట్‌లుగా మిగిలిపోయాయి. ఇప్పుడు వాటికి ఎల్లంపల్లి తోడవ నుం ది! ఇదేమని ప్రశ్నిస్తే భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఏమన్నారో చూడండి: 'కృష్ణానదిలో నీళ్ళు లేవు ( మరి రాయలసీమకు ఇవ్వడానికి ఎందుకు హైరాన పడుతున్నారు? ).గోదావరిలో బోలెడు మిగులు జలాలు ఉన్నాయి ( తెలంగాణను అభివృద్ధి చేయకుండా అట్టిపెడితే బోలెడేం కర్మ, సమస్తం మిగులే కదా!). ఖర్చు గురించి ఆలోచించ కుండా పెద్ద మనసుతో అందరం ప్రభుత్వం చేస్తున్న మంచిపనికి సహకరించాలి'. జంట నగరాల త్రాగునీటికి బచావత్ ట్రిబ్యునల్ 3.9 టిఎంసిల నీటిని కేటాయించింది.
కాలక్రమేణ జంటనగ రాల అవసరాలు పెరగడంతో అదనపు నీటిని ఎక్కడనుం చి తేవాలన్న ప్రశ్న వచ్చింది. అప్పటికే కృష్ణా బేసిన్ నికర జలాలకు సరిపడా వివిధ ప్రాజెక్టుల కేటాయింపులు జర గడం మూలంగా ప్రభుత్వ దృష్టి నిర్మాణంలో ఉన్న పోచంపాడు ప్రాజెక్ట్‌పై పడింది. అయితే పోచంపా డు వద్ద లభించే గోదావరి జలాలు ఆ ఆయకట్టుకే సరిపో తాయి తప్ప మిగులు జలాలు లేవని నిర్దారించింది. దరి మిలా గోదావరి బేసిన్‌లో ఉన్న 'మంజీరా' ఉపనది పైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ నదీ జలాలను జంటనగ రాలకు తరలించడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించ డానికి 1972లో శ్రీనివాసరావు కమిటీని నియమించారు. 'మంజీరా నదిలో లభించే నీరు ఆ నదిపై కట్టిన ఘనపు రం ఆనకట్ట, నిజాం సాగర్ అవసరాలకు మించి లేదు కనుక మంజీరా నదినుంచి నీరు తీసుకు వచ్చే ప్రయ త్నాన్ని బేఖాతరు చేస్తూ కృష్ణానది నుంచే నీరు తీసుకురా వడం మేలని' ఆ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.
' కృష్ణాజలాలను రాయలసీమకు తరలించాలనే కోరిక ప్రబలంగా ఉన్న' ఆనాటి నాయకులు ఆ నివేదిక త్రోసిపుచ్చి మంజీరాలో లేని నీటిని ఉన్నట్టుగా సృష్టించి, కృష్ణా జలాలను తీసుకువస్తే ప్రమాద ఘంటికలు మ్రోగు తాయనే కొత్త వాదనకు ప్రాచుర్యం కల్పించారు. నెమ్మ దిగా సింగూరు ప్రాజెక్టు నిర్మాణం తెరపైకి వచ్చింది. ఆ విధంగా సింగూరు జంటనగరాల తాగునీటి అవసరాల కు పరిమితం కావడంతో మంజీరా నీటిని నమ్ముకున్న మెదక్, నిజామాబాద్ రైతాంగం నోట్లో మన్ను పడింది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి 16.5 టి ఎంసిల నీరును మూడుదశలలో జంటనగరాలకు తరలించే లక్ష్యంతో 1978లో కృష్ణాజల పథకాన్ని రూపొందించా రు. ఈ పథకం ప్రకారం సాగర్ సమీపంలోని సుంకేసుల దగ్గర 16.5 టిఎంసిల నీరు తీయగల ఒక 'ఇంటేక్ వెల్' ను ఏర్పాటుచేసి, ఆ నీటిని ఎత్తైన ప్రదేశంలో కట్టిన జలా శయంలో భద్రపరుస్తారు. ఆ తర్వాత ఆ నీటిని కొండాపూ ర్ గ్రామంలో నిర్మించే 'శుభ్రపరిచే ప్లాంట్'కు తరలిస్తారు. అక్కడ శుద్ధి ప్రక్రియ పూర్తయిన తరువాత జంటనగరాల ప్రజలకు సరఫరా చేస్తారు.
పథకం ఇదయితే ఆచరణ మరోలా ఉంది! సుంకేసుల వద్ద 'ఇంటేక్ వెల్' నేర్పాటుచే యలేదు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి సాగర్ నీటిని ఎత్తిపోతల ద్వారా అందించే ఎస్ఎల్‌బిసి కాలువ పథకంలో అంతర్భాగమైన 'అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్' నుంచి కృష్ణా జలాలను తరలించడం ప్రారం భించారు! మొదటి దశలో 5.5 టిఎంసిలను తరలించి రెండో దశను చేపట్టారు. తీరా మూడో దశకు వచ్చే సరికి ప్రభుత్వ వైఖరి మారిపోయింది. పోతిరెడ్డిపాడునుంచి వరదజలాల ముసుగులో నికర జలాలను రాయలసీమకు తరలించడానికి ప్రభుత్వం పూనుకొంది. ప్రతిపక్షాలు ఎంతగా అభ్యంతరం తెలిపినా ఈ తరలింపు పనులు నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి. కృష్ణా జల పథకం మూడోదశను పూర్తిగా రద్దుచేసి ఆ దశ ద్వారా తరలించా ల్సిన 5.5 టిఎంసిల నీటిని కూడా శ్రీశైలం ద్వారా సీమకు తరలించాలనేది పాలకుల యోచనగా ఉంది. పాలకుల తాబేదార్లు మినహా ఎవరూ ఈ యోచనను సమర్థించ డంలేదని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.
ఇక గోదావరి మిగులుజలాల మాటకొస్తే అసలు ఆ నదీ జలాలను ఏ ఏ ప్రాజెక్టులకు కేటాయించారో బాహాటంగా ప్రకటించనేలే దు. అయితే పోలవరం పై జరిగిన అఖిల పక్ష సమావేశం లో మాత్రం వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన మొత్తాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన సమావేశం లో హామీ ఇచ్చిన విధంగా 'జల విధానం' ముసాయిదా ను రూపొందించడమయితే రూపొందించారు గాని కార ణాంతరాల వల్ల విడుదల చేయలేదు. అఖిల పక్ష సమా వేశంలో ఇచ్చిన లిస్టులో గానీ, ముసాయిదా జల విధా నంలో ఇచ్చిన లిస్టులో గాని ఎక్కడా జంటనగరాలకు గోదావరి జలాల కేటాయింపు లేదు. మరి హఠాత్తుగా ప్రభుత్వానికి ఈ ఆలోచన ఎందుకొచ్చినట్టు? ముందు ప్రాణహిత స్కీం నుంచి మళ్లించే 160 టిఎంసిలలో 80 టిఎంసిలను జంటనగరాలకు వాడతామని ప్రకటించింది. దానిమీద నిరసనలు వ్యక్తమయ్యేటప్పటికి పల్లవి మార్చి ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి 31 టిఎంసిలు అంటోంది! నిజంగా ఎల్లంపల్లిలో 31 టిఎంసిల జలాలు జంటన గరాల అవసరాలకు సరిపడా ఉన్నాయా? ఎల్లంపల్లి బ్యారేజి నిర్మాణం శ్రీరాంసాగర్ దిగువున ఉంది.
ఎల్లంప ల్లి దగ్గర నీటి లభ్యతను 63 టిఎంసిలుగా నిర్దారణ చేశా రు. ఎల్లంపల్లి నిర్మాణం ప్రస్తుతం విడిగా సాగుతున్నా అది అంతిమంగా ప్రాణహిత పథకంలో అంతర్భాగమ వుతుంది. అంటే ప్రాణహిత పథకం ద్వారా మళ్లించే 160 టిఎంసిలు, ఎల్లంపల్లి దగ్గర లభ్యమయ్యే 63 టి ఎంసిలు మొత్తం 223 టిఎంసిల నీరు ఏ ప్రాతాలకు ఎలా ఎలా ఖర్చు పెట్టాలో ఇదివరకే నిర్ణయమై పోయింది. అందులో జంటనగరాలకు 10 టి ఎంసిల నీరు కేటాయించబడింది. ప్రాణహిత స్కీం పక్కన బెట్టి దాని గురించి పట్టించుకో కుండా ఎల్లంపల్లి నుంచి 31 టిఎంసిల నీరు లాక్కుపోవ డానికి ప్రభుత్వం ఇప్పుడు చేపడుతున్న చర్య దుర్మార్గ మైనదిగానే భావించాలి. ఎల్లంపల్లినుంచి 31 టి ఎంసిల నీటిని తరలిస్తే ఆ మేరకు కరీంనగర్, మెదక్ జిల్లాల రైతాంగం నష్టపోవడం తథ్యం.
తాగు, సాగనీటి అవస రాలు ఒకే ప్రాజెక్టు నుంచి తీర్చవలసివస్తే తాగునీటి అవ సరాలకు ప్రాధాన్యం లభిస్తుందని ప్రత్యేకించి చెప్పవల సిన అవసరం లేదు. ఎల్లంపల్లిలో లభించే నీటిపై ప్రథమ ప్రాధాన్యం తాగునీటికి వస్తుంది. అంటే జంట నగరాల అవసరాలకు సరిపడానీరు తీసుకున్నాకే మిగిలిన నీటిలో ఎన్‌టిపిసి అవసరాలు తీరాక ఆ పైన సాగునీటికి వినియో గించటం జరుగుతుంది. అంటే ఎల్లంపల్లి మరో సింగూరు కావడమే! జంటనగరాలకు నీరు అందించే ప్రక్రియలో గతంలో సింగూరు, ఇప్పుడు అక్కంపల్లి, మున్ముందు ఎల్లంపల్లి ప్రాజెక్టులు బలిపశవులు కానున్నాయి. ఇది అన్యాయం. తెలంగాణకు ఈ అన్యాయం జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవా లి. అవేమిటో పేర్కొంటాను: గతంలో తీసుకున్న నిర్ణ యాలకు లోబడి ముందుగా కృష్ణాపథకం మూడోదశను తక్షణమే అమలు చేయాలి.
రెండో పనిగా సాగర్‌నుంచి అక్కంపల్లికి బదులుగా సుంకేసుల ఇంటేక్ వెల్ నుంచి నీటిని విడిగా తరలించే పనులు ప్రారంభించాలి. అక్కం పల్లిని నల్లగొండకు ప్రయోజనాలు చేకూర్చే జలాశయం గా మాత్రమే ఏర్పాటు చేయాలి. మూడో చర్యగా సింగూ రును విముక్తం చేసే ప్రక్రియలో గోదావరి నుంచి నీరు తీసుకురావలసి వస్తే ఇటీవల 'ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజ నీర్స్' వారు ప్రభుత్వానికి సమర్పించిన 'కంచాల పల్లి' ప్రాజెక్టు గురించి ఆలోచించాలి. ఇవేవీ చేపట్టకుండా ఎల్లంపల్లినుంచి జంటనగరాలకు నీళ్ళు తీసుకువచ్చే టెండర్లు ఖరారు చేస్తే తెలంగాణ ప్రయోజనాలకు విరు ద్ధంమే కాక ప్రభుత్వం పూర్తిగా అప్రజస్వామికంగా వ్యవహరిస్తుందని భావించవలసివస్తుంది. దశాబ్దాలుగా ప్రభుత్వాలు తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షతతో తెలంగాణ ప్రజలు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు.
andhra jyothy (1-24-2008)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment