Wednesday, September 17, 2008

తెలంగాణ రైతాంగ పోరాటం పాఠ్య పుస్తకాల్లో లేదెందుకు..? - నవీన్ ఆచారి


నిరంకుశ నిజాం మెడలు వంచిన రోజిది. దొరలు జమీందాఋలను పల్లెల నుండి తరిమిన రోజిది. యావత్ ప్రపంచాన్నే ప్రభావితం చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దెబ్బకు నిజాం వాడి తాతముత్తాతలు దిగొచ్చిన రోజిది.


ఒక ప్రకాశం గుండీలు విప్పితేనే ఆహ ఓహో అని పొగిడే సర్కారీ రచయితలకు నాలుగు వేలమందికి పై చిలుకు యోధులు నిజాం తుపాకులకు గుండెలెదురొడ్డి పోరాడడం ఏ పుస్తకాల్లో రాయరెందుకో. ఆ రోజు ప్రకాశం ఆ పని చేసినప్పుడు చుట్టు వేలాది మంది ఉన్నారు. ఇది నగరం మద్యలో జరిగింది. ఈయనను చంపితే ఆ అధికారి పై అధికారికి జవాబు చెప్పుకోవాలి. (అప్పటికే నైజాం ప్రాంతం లో 'బారాఖూన్ మాఫ్' అనె వాడుక ఉన్నది. అంటే పన్నెండు హత్యలవరకు నిజాం సైనికుడు చెయ్యొచ్చు. పై అధికారి అనుమతి అవసరం లేదు. ) మిగతా గుంపు హింసకు దిగొచ్చు. పేపర్లలో పెద్దగా రాస్తారు. ఇలాంటి secured environmentలో ప్రకాశం చేసిందీ గ్రేట్ ఐతే ఎవరికి జవాబు దారి కాని, ఎంతటి దారుణానికైనా తెగబడే నిజాం ను ఎదిరించిన వేలాదిమంది ప్రజలు ఎంతటి సాహసయోధులో ఒక్కసారి ఆలోచించండి.
ఈరోజు చైనా, రష్ష్యాల్లో కూడా విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్తులకు చెప్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఆ విషయాలు పాఠ్య పుస్తకాల్లో పెట్టరు. చీరాల పేరాల పేరుతో దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య ఒక వారం రోజులు వూరవతల కాపురం పెడితే ఏదో గొప్ప సాహసం చేసినట్టు రాసేవాళ్లు ఆరుట్ల కమలాదేవి, రావినారాయణ రెడ్డి, కొమురయ్య, వంటి వేలాది యువకిశొరాలు ప్రాణాల్నిఫణంగా పెట్టి అజ్ఞాతం లో సంవత్సరాల తరబడి ఉన్న సంగతి గుర్తు చేసుకోరెందుకు. పార్లమెంట్లో బాంబులేసిన భగత్ సింగ్ అంతటి వీరుడు నిజాం మీద బాంబులేసిన మా నారాయణ్ రావు పవార్ పేరేది..?
ఏ ఆంధ్ర కేసరులకు తీసిపోని ప్రజా యోధులు మాకున్నారు. మేరునగధీరులు మాకున్నారు. బెజవాడ లో జరిగిన కాంగ్రేస్ సభల గురించి అకాడమీ పుస్తకాల్లొ కాకిగోల పెట్టే సర్కారు ప్రపంచ చరిత్ర కే పాఠాలు నేర్పిన తెలంగాణ సాయుధ రైతాంగ పొరాటం గురించి పెదవి కదపదెందుకు. పిల్లలకు చెప్పదెందుకు.
ఇది, ప్రజా కంటక నిరంకుశ నిజాం పై బాంబుల వర్షం కురిపించిన మా ప్రజా యోధులకు చరిత్ర పుటల్లో స్థానం దక్కనియ్యకుండా చేసే వలస పాలకుల సాంస్కౄతిక విధ్వంసం కాదా..? దీనికి ఒక ప్రాంతం వారి బానిసత్వం లో తెలంగాణ ఇంకా ఉండడమె కారణం కాదా..? అందుకే మా తెలంగాణ మాకు రావాలి. మన తెలంగాణ మనక్కావాలి.

భూమి కోసం భుక్తి కోసం స్వేచ్చా స్వతంత్రాల కోసం పోరాడి నియంతల గుండెల్లో నిదురించిన వేగు చుక్కల్లారా జాతి మీకు తలవంచి నమస్కరిస్తుంది. మీ త్యాగం నిరుపమానం.
మీ స్ఫూర్తి తో వలస పాలకులపై పోరాడుతం. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుతం.
జై తెలంగాణా జై జై తెలంగాణా

2 comments:

Kathi Mahesh Kumar said...

స్వాతంత్ర్యానంతరం జరిగిన చాలా పరిణామాల్ని అంగీకారాత్మకంగా అక్షరబద్దం చేసిన దాఖలాలు లేవు. అందుకే చరిత్రలో ఈ contemporary విషయాలు బోధించడం జరగటం లేదు.

ఈ విషయాలపట్ల ధృక్కోణాలూ,వాదాలూ,వివాదాలూ, ఇజాలే తప్ప "చరిత్ర" దొరకడం కష్టమే!

naveen achari said...

ఓక ప్రాంతం వారి కథలు పుస్తకాల్లొ ఉంటాయెందుకు.. ఇంకొకరివి ఉండవెందుకు అంటూన్నా..? స్వాతంత్ర్యం వాచ్చాకనే కదా ప్రకాశం పంతులు పాఠాల్ని స్కూల్ పుస్తకాల్లో పెట్టింది..!! మరి అది ఉందెలా..!! ఇది లేదెలా..?

స్కూలు పుస్తకాల్లో పెట్టడానికి ఆ మహనీయుల గూర్చి ఇప్పటివరకు వచ్చిన పుస్తకాలు సరిపోతాయి. తెలంగాణ మహోద్యమం పై ఇప్పటికే వందలాది పుస్తకాలు, పరిశొధనా వ్యాసాలు వచ్చాయి. ఇంకేం కావాలి. కుంటిసాకులతో అందరిని నమ్మించలేం. మన్యం అడవుల్లో అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం ఉంటుంది. కాని రాజధాని హైదరాబాదు తో సహా తెలంగాణ లోని పది జిల్లాల్లో జరిగిన పోరాటం లో లక్షలాది మంది పాల్ఘొన్నారు. వేలాది మంది అమరులయ్యారు. సంవత్సరాల తరబడి నిర్విరామంగ ప్రజలు నిరకుశ పాలకులపై తిరగబడ్డారు. ఇదెందుకు వ్రాయరు అంటున్నా.

కావాల్సింది చిత్తశుద్ది మాత్రమే.