నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంత విముక్తి జరిగి ఈ నెల 17వ తేదీతో 60 సంవత్సరా లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు అధి కారికంగా ఉత్సవం జరుపుకునే అదృష్టానికి నోచుకోకపోవ డం అత్యంత బాధాకరం. నాటి హైదరాబాద్ సంస్థానం విముక్తి తర్వాత భాషా ప్రాతిపదికన విడిపోయి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో విలీనమైన ప్రాంతాలలో అక్కడి ప్రజలు అధికారికంగా 1948 సెప్టెంబర్ 17వ రోజు స్వాతంత్య్రం లభించిన రోజుగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు.
ప్రధానంగా విముక్తి పోరాటం జరిగిన తెలంగాణ ప్రాంతం లో మాత్రం కేవలం రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, స్వాతంత్య్ర సమరయోధులు జాతీయ జెండా ఎగురవేసి నామమాత్రంగా జరుపుకోవడం ఎంతవరకు న్యాయం? ఇదే నా మన ప్రాంత విముక్తికి పోరాడిన యోధులకు మనం అర్పించే నివాళులు? దేశానికి స్వాతంత్య్రం రాకముందే నిజాం నాటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌ను సంప్రదించి హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా కొనసాగించడానికి లాబీయింగ్ చేశాడు.
ఆనాడు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్న 40 దేశాలకంటే హైదరాబాద్ సంస్థానం పెద్దదని, ఆర్థికంగా పరిపుష్టి కలిగిందనే వాదనను బాగా ప్రచారంలోకి తెచ్చారు. అయినప్పటికీ నిజాం దురాలోచనను మన పాలకులు గుర్తించలేకపోయారు. 1947 ఆగస్ట్ 15వ తేదీన యావత్ దేశం స్వాతంత్య్ర వేడు కలు జరుపుకుంటుంటే తెలంగాణ ప్రజానీకం మాత్రం ఇంకా నిరంకుశ ప్రభుత్వ ఉక్కు పాదాల కింద నలుగుతూ నిజాం ప్రైవేట్ ఆర్మీ రజాకార్ల దురాగతాలను అనుభవిస్తున్న ది. మన ప్రాంతంలో గృహ దహనాలు, మహిళలపై అత్యా చారాలు, గృహ నిర్బంధం, లూటీలు సాగడం మన దుర దృష్టం.
ఆనాడు గాంధీజీ పిలుపు మేరకు ఎవ్వరైనా ఉత్సా హంగా త్రివర్ణ పతాకం ఎగురవేస్తే ఇక వారి పని అయిపో యినట్లే. తెలంగాణ ప్రాంతంలోని 8 జిల్లాలలో జరిగిన ఈ సంఘటనలు ప్రజల మదిలో నుంచి ఇంకా తొలగిపోలేదు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఆర్య సమాజ్, ఆర్ఎస్ఎస్ తదితర సంస్థలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే వారి కుటుంబాలు ఆంధ్రప్రాంతానికి, మైసూ ర్, మహారాష్ట్ర ప్రాంతాలకు, ఇతర సరిహద్దు ప్రాంతాలకు వలస వెళ్ళి శరణార్థులుగా దుర్భరమైన జీవనాన్ని కొనసాగించారు.
లక్షలాది మంది వృద్ధులు, మహిళలు, పిల్లలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సరిహద్దు ప్రాంతాలకు వెళ్తుంటే వారిని తరిమి తరిమి హింసించిన సంఘటనలు కోకొల్లలు. నిజాం ప్రైవేట్‌సైన్యం, ఖాసీం రజ్వీ నాయకత్వం లో రజాకార్లు, వారి తాబేదార్లుగా ఉన్న జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాములు, వారికి వంతపాడే మనుషులు సామా న్య ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. 1947 ఆగస్ట్ 15 నుంచి 1948 సెప్టెంబర్ వరకు జరిగిన ఈ పోరా టం భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో సముచిత మైన స్థానాన్ని పొందలేకపోయింది.
నిజాం ప్రభువు ఈ ప్రాంతా న్ని భారతదేశంలో విలీనం చేయడానికి నిరాకరించడమే గాక, స్వతంత్ర దేశంగా కొనసాగడానికి ఇతర దేశాల సహకారం పొందాలని చేసిన ప్రయత్నాలు మనం గుర్తు తెచ్చుకోవాలి. దేశం యావత్తూ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటుంటే మన ప్రాంతంలో దుస్థితిని మార్చేందుకు స్వామి రామానం దతీర్థ సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. 1947 డిసెంబర్ 4న ఆర్య సమాజ్ కార్యకర్త నారాయణరావు పవార్ నిజాం కారుమీద బాంబు వేశారు. రజాకారులతో విముక్తి ఉద్యమకారు లు తలపడడంతో అంతర్యుద్ధం మొద లైంది.
1948 జనవరి 15న ఖమ్మం జిల్లా మీనబోలు దగ్గర ఆరుగురు యువకుల్ని రజాకార్లు చంపివేశారు. ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా కోలుకొండ గ్రామంలో 13 మందిని హత్య చేశా రు. మార్చి 4న నల్లగొండ జిల్లా భువనగిరి తాలూకా రేణిగుంట గ్రామంలో 26 మందిని రజాకార్లు పొట్టనబెట్టుకున్నారు. జూలై 19న గుండ్రంపల్లిలో 21 మందిని ఊరి బయ టకు తీసుకెళ్ళి కాల్చివేశారు. ఆగస్టు 25న రజాకార్లు వరంగ ల్ జిల్లా కూటిగల్ గ్రామంలో 30 మందిని, ఆత్మకూరులో 11 మందిని కాల్చి చంపారు. అదేవిధంగా భైరాన్‌పల్లి గ్రామంలో 92 మందిని వరుసగా నిలబెట్టి కాల్చివేశారు.
పరకాల గ్రామంలో జెండా ఎగుర వేయడానికి వెళ్ళిన ఆ ప్రాంతవాసులను సుమారు 50 మందిని నిజాం సైనికులు, రజాకార్లు కలిసి కాల్చి చంపివేశారు. చౌటపెల్లి, కొంకపాక గ్రామాలలో 15 మంది రైతులను సజీవంగా గడ్డివాములో వేసి తగులబెట్టారు. ఈ దురాగతాలన్నీ ఇమ్రోజ్ పత్రికలో వ్రాసినందుకు జర్నలిస్టు షోయబుల్లాఖాన్ రెండు చేతులు నరికి చంపారు. 'తరతరాల స్వప్నాల సుందర ఫలమ్ము స్వైర భారత భూమి చూపేనో, లేదో విషము గుప్పించినాడు,

నొప్పించినాడు మా నిజాం రాజు జన్మజన్మాల బూజు' -దాశరథి మనకు స్వాతంత్య్రం ఎప్పుడు లభించిందని తెలంగాణ లోని ఏ పాఠశాలలో ఏ విద్యార్థిని మనం ప్రశ్నించినా నిస్సంకోచంగా 1947 ఆగస్ట్ 15వ తేదీ అని జవాబిస్తారు. కానీ 1948 సెప్టెంబర్ 17 అని జవాబివ్వడం చాలా అరుదు. సుప్రీంకోర్టులో 1948 సెప్టెంబర్ 17కు ముందు ఒక కేసు వేస్తే అది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని, నిజాం ప్రభుత్వం పరిశీలించాలని, ఆ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగం కాదని వేరే దేశం అని తెలుపడాన్ని బట్టి ఈ పోరాటం ఎంత ప్రాముఖ్యత గలదో తెలుస్తున్నది.
జలియన్‌వాలాబాగ్ మారణకాండ వంటివి తెలంగాణ ప్రాంతంలో ఎన్నో జరి గాయి. పరకాల, భైరాన్‌పల్లి దురంతాలు వింటుంటే ఒళ్ళు జలదరిస్తుంది. మారుమూల పల్లె ప్రజలు ప్రాణాలకు సైతం తెగించి జరిపిన పోరాటాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవా న్ని దెబ్బతీస్తున్నది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సావాన్ని అత్యంత ఆర్భాటంగా జరుపుకునే రాష్ట్ర ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 17ను ఎందుకు అధికారికంగా జరుపదు?

దీని వెను క ఉన్న బలమైన కారణమేమిటి? తెలంగాణ ప్రాంత ప్రజల పోరాటప టిమపట్ల ఎందుకింత నిర్లక్ష్య వైఖరి? సాక్షాత్తు రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీ. కె జానారెడ్డి సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని ముఖ్యమంత్రిని కోరానని తెలిపారు. కాని నేటికీ అది వాస్తవ రూపం దాల్చలేదు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఈ మహా పోరాటానికి కొంతమంది మతం రంగు పులమడం దురదృష్టకరం.
నిజాం రాజును వ్యతిరేకించడం అంటే ముస్లింలను వ్యతిరేకించినట్టుగా కొంతమంది అభిప్రాయపడడం సరైంది కాదు. నిజాంను వ్యతిరేకించిన వారిలో అనేక మంది ముస్లిం సోదరులు ఉన్నారనే విషయం మనం మరిచిపోకూడదు. చరిత్రకు మతం అంటగట్టడం ఎంతవరకు సబ బు? వందల సంవత్సరాల కుతుబ్‌షాహి, అసఫ్‌జాహి పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటం విజయవంతమైన 1948 సెప్టెంబర్ 17ను ఒక పండుగ రోజుగా భావించే హక్కు తెలంగాణ వాసులకు లేదా? హైదరాబాద్ విమోచన దినమైన సెప్టెంబర్ 17నాడు మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అధికారికంగా ఉత్సవాలు నిర్వ హిస్తున్నాయని తెలుపుతూ, మన రాష్ట్రం ఎందుకు నిర్వ హించడం లేదంటూ బిజెపి శాసనసభ్యుడు శ్రీ జి. కిషన్‌రెడ్డి అడి గితే ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి స్పందించలేదు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎంత ఒత్తిడి తెచ్చి నప్పటికీ స్పందించని శ్రీ చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోరిక బలపడడం గమనించి, వారి పార్టీ కార్యాలయంలో ఉత్సవం జరుపుతారు. కాని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా ఎగురవేయాలని , అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవం నిర్వహించాలని అడగడానికి మాత్రం సంకోచిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఎన్నో త్యాగాలు చేసిన కమ్యూనిస్టులు సైతం తెలంగాణ విముక్తి జరిగిన రోజున అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేయరు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై తామే చాంపియన్లమని చాటుకుంటున్న టిఆర్ఎస్ సైతం అధికారికంగా సెప్టెంబర్ 17 ఉత్సవాన్ని నిర్వహించాలని ఇంతవరకు అడిగిన దాఖలా లేదు. నాటి ఉప ప్రధాని హోం శాఖామాత్యులు, ఉక్కుమనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమా అని పోలీస్ చర్య తీసుకోకపోయి ఉంటే ఈ ప్రాంతం వేరే దేశంగా ఉండిపోయేదనే సంగతి అందరికి తెలుపాల్సిన బాధ్యత మన కు లేదా? గత దశాబ్దకాలంగా భారతీయ జనతా పార్టీ ప్రతీసారీ సెప్టెంబర్ 17ను విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నది.
తెలంగాణ ప్రాంతం విడిపోవాలనే ఉద్యమానికి వెనుకబాటుతనం, అన్ని రంగాలలో కొనసాగుతున్న వివక్షతతో పాటు ఈ ఉత్సవం నిర్వహణ పట్ల చూపుతున్న ఉదాసీన వైఖరియే కారణాలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితేనే ఈ విముక్తి పోరాటానికి గుర్తింపు వస్తుందనే భావన నానాటికి బలపడుతున్నది. 60 సంవత్సరాలు పూర్తికాగానే దేశ స్వాతంత్య్ర ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. రాష్ట్ర అవతరణ 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగానూ ఉత్సవాలు జరిగాయి.

వేలాది ప్రజల బలిదానం తర్వాత హైదరాబాద్ రాష్ట్ర విమోచన జరిగిన సెప్టెంబర్ 17న ప్రభు త్వం ఎందుకు అధికారికంగా ఉత్సవాలు నిర్వహించదు? సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధి కారికంగా జరపాలని, విద్యార్థుల పాఠ్యాంశంగా ఈ చారిత్రాత్మక ఉద్యమాన్ని చేర్చాలని, షోయబుల్లాఖాన్, కొమురభీం వంటి ప్రముఖుల విగ్రహాలు నెక్లెస్ రోడ్డులో ప్రతిష్ఠించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నది.
(వ్యాసకర్త బిజెపి రాష్ట్ర అధ్యక్షులు) in Andhra jyothy 2008 Sept 17.
2 comments:
"నిజాం రాజును వ్యతిరేకించడం అంటే ముస్లింలను వ్యతిరేకించినట్టు కాదు. నిజాంను వ్యతిరేకించిన వారిలో అనేక మంది ముస్లిం సోదరులు ఉన్నారు" అనే మీ వాదన బాగుంది.
తుర్రేబాజ్ ఖాన్ , బందగి , షోయబుల్లాఖాన్ లాంటి అనేక మంది ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనలో హత్యచేయబడ్డారు.1946-48 సంవత్సరాల్లో బందగి హత్య నేపధ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని సుంకర , వాసిరెడ్డి లు మాభూమి నాటకాన్ని వ్రాసి ఊరూరా ప్రదర్శనలిచ్చారు.మా భూమి నాటకం షేక్ బందగీ సమాధి దగ్గర నిలబడి నివాళులర్పించటంతో ప్రారంభమయింది.1942లో షేక్ బందగీ ని విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు హత్యచేశారు.దేవులపల్లి వెంకటేశ్వరరావు 1845లోనే 'జనగామ ప్రజల వీరోచిత పోరాటాలు' పుస్తకం లో బందగీ గురించి వివరంగా రాశారు.తిరునగరి రామాంజనేయులు వీరబందగి పేర బుర్రకథ వ్రాసి ప్రదర్శనలిచ్చారు.
"భారతీయులంతా హిందువులే.హిందువులు కానివారు భారతీయులేకాదు.హిందువు అన్న పదానికి అర్థం మతం కాదు,అది జీవన విధానం" అన్నారు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్(సాక్షి 1.3.2010).
ఈ విస్తృత నిర్వచనం ప్రకారం మనదేశంలో జన్మించిన క్రైస్తవ,ముస్లిం భారతీయ సోదరులంతా జన్మతా హిందువులే కదా?
Post a Comment