ఎవరు తాలిబన్లు
ఏది సాంస్కృతిక విషాదం
ఇదే మాట తాలిబన్లను అంటే ఏం చేసేటోళ్లో కాని
హైదరాబాదు నడిబొడ్డున
ముగ్గురు నిలబడి కూడా మీరు అనగలరు
ఔను
ఈడ మట్టే అంత
స్వేచ్ఛగ బతకనిస్తది
ఒక్క మిమ్మల్ని అనేగాదు, ఎవ్వరినైనా
ఏం మంచితనమో ఏమో
పడుడేగాని అన్నదెర్కలేదు
వందల మంది అమరులై లక్షల మంది రోడ్డెక్కిన ఉద్యమం
ఏమేం చేయగలదో మీకు తెల్సు
ఐనా అంటరు
మేం తాలిబన్లమే
మమ్ముల రాజ్ థాకరేలు ముల్లాఒమర్ల లెక్కల కల్పి
మా తాతల్ని మా కట్ట మీదనే లేకుండ చేసిన
అన్నలూ ఒక్క మాట చెప్పుండ్రి
ఏది సాస్కృతిక విషాదం
ఈ విషాదం మొన్న మిలియన్ మార్చ్ నాడు జరిగిందొక్కటేనా
యాబై ఏండ్ల నుంచి మామీద నడుస్తున్న రుద్దుడు కార్యక్రమం కూడానా
కొంచెం చెప్పుండ్రన్నా
ఏది చారిత్రక విషాదం
ఈ నేలతో ఏ బంధమూ లేకపోయినా
30 ఏండ్లు హుస్సేన్ సాగర్ ఒడ్డున దర్జాగా నిలబడి
పాలాభిషేకాలు చేయించుకొని దండలేసుకున్న
కాటన్లు రాఘవలూ ఇయ్యాల కూలుడా
లేక
వట్టికోట, భాగ్యరెడ్డి, తుర్రెబాజిఖాన్, కొమురంభీంలెవరో
ఇప్పటికీ మన పోరగాండ్లకు తెల్వకపోవుడా
ఏది చారిత్రక విద్వంసం
మాట్లాడకుంటే ఎట్ల
ఏదో ఒకటి చెప్పాలెగదా
ఇద్దరి దగ్గరా మహానీయులున్నపుడు
ఈ వన్ వే ట్రాఫిక్ ఏంది.?
ఏందన్నా మాట్లాడరూ..
మనది ఒక్క జాతే కదా..
మనం ఒక్క తల్లి పిల్లలం కదా..
ఏది సాంస్కృతిక విషాదం
ఇదే మాట తాలిబన్లను అంటే ఏం చేసేటోళ్లో కాని
హైదరాబాదు నడిబొడ్డున
ముగ్గురు నిలబడి కూడా మీరు అనగలరు
ఔను
ఈడ మట్టే అంత
స్వేచ్ఛగ బతకనిస్తది
ఒక్క మిమ్మల్ని అనేగాదు, ఎవ్వరినైనా
ఏం మంచితనమో ఏమో
పడుడేగాని అన్నదెర్కలేదు
వందల మంది అమరులై లక్షల మంది రోడ్డెక్కిన ఉద్యమం
ఏమేం చేయగలదో మీకు తెల్సు
ఐనా అంటరు
మేం తాలిబన్లమే
మమ్ముల రాజ్ థాకరేలు ముల్లాఒమర్ల లెక్కల కల్పి
మా తాతల్ని మా కట్ట మీదనే లేకుండ చేసిన
అన్నలూ ఒక్క మాట చెప్పుండ్రి
ఏది సాస్కృతిక విషాదం
ఈ విషాదం మొన్న మిలియన్ మార్చ్ నాడు జరిగిందొక్కటేనా
యాబై ఏండ్ల నుంచి మామీద నడుస్తున్న రుద్దుడు కార్యక్రమం కూడానా
కొంచెం చెప్పుండ్రన్నా
ఏది చారిత్రక విషాదం
ఈ నేలతో ఏ బంధమూ లేకపోయినా
30 ఏండ్లు హుస్సేన్ సాగర్ ఒడ్డున దర్జాగా నిలబడి
పాలాభిషేకాలు చేయించుకొని దండలేసుకున్న
కాటన్లు రాఘవలూ ఇయ్యాల కూలుడా
లేక
వట్టికోట, భాగ్యరెడ్డి, తుర్రెబాజిఖాన్, కొమురంభీంలెవరో
ఇప్పటికీ మన పోరగాండ్లకు తెల్వకపోవుడా
ఏది చారిత్రక విద్వంసం
మాట్లాడకుంటే ఎట్ల
ఏదో ఒకటి చెప్పాలెగదా
ఇద్దరి దగ్గరా మహానీయులున్నపుడు
ఈ వన్ వే ట్రాఫిక్ ఏంది.?
ఏందన్నా మాట్లాడరూ..
మనది ఒక్క జాతే కదా..
మనం ఒక్క తల్లి పిల్లలం కదా..
-నవీన్ ఆచారి
2 comments:
<> "తెలంగాణలో ఎవ్వడైన జైతెలంగాణ అనాల్సిందే లేకుంటే భౌతిక దాడులకు దిగుతాం" అని ఓ.యు విద్యార్థి ఐ.కా.స నేతలు టి.వి9 ముఖంగా ప్రకటించలేదా?
<> తెలుగువారందరిదీ ఒకే జాతి, ఒకే తల్లి బిడ్డలని మీరే జెప్తున్రు. గట్లైతె గా పోరగాల్లు తెలగాణ బిడ్డలు కాకెట్లబోతరు?
ఆయాల్గీ బొంమ్మల్ పెట్టె సంది తెలంగాణ పోరడు సి.నా.రె కాదె గా కమిటి చైర్మన్?
తెలుగుతల్లా ఎవనికి తల్లి? అన్నోల్లకి గిప్పుడు ఒకే తల్లి బిడ్డలెట్లైతం?
నిజమే ఓయూ స్టూడెంట్స్ అన్నరు. ఐతే ఎంతమంది మీద దాడులు జరిగినయో మీరే చెప్పాలి. చలసాని శ్రీనివాసు, జొన్నవిత్తుల ,నరసిం హరావు, నన్నపనేని లాంటి పొద్దున లేస్తే టీవీ స్టూడియోల చుట్టు తిరిగే వీళ్లకు ఏపాటి సెక్యురిటీ ఉంటదో అందరికీ తెల్సు. ఒక్కొక్కరిమీద హత్యాయత్నాలతో సహా 150 కేసులు పెట్టారు కదా.. సీరియెస్ గా అనుకుంటే ఏం జరగకుండా ఉండేదా.? ఎంతమందికి ఓయూ విద్యార్థులు 'మర్యాదలూ చేసారూ..?
'అన్నీ తెలిసిన ' ఎంటీఆర్ ఇంకొకడి మాట ఎప్పుడైనా విన్నాడా.? ఇగ సినారె ఎంత. ఐదేండ్లు పీయెం గా ఉన్న పీవీ నే ఐదేండ్లు సీయెం గా ఉండలేకపోయిండు. తెలంగాణోళ్లకు ఇచ్చె పదవులకు పవర్ ఉన్నట్టు చరిత్రలో లెదు. అందుకే కదా తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం అడుగుతున్నరు కాని ఏపీ కి మావోణ్ని సీయెం చెయ్యండి అనట్లేదు.
ఒకే తల్లి బిడ్డలం కాదు అన్నది ట్యాక్ బండ్ మీది విగ్రహాల లెక్కలే చెప్తాయి. ఇంకా ఆ మాట చెప్పి కలిసిఉందాం అనకండి అని కవిత ఉద్దేశ్యం.
Post a Comment